![]() |

ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ అనే రీతిలో భారతీయ చిత్ర పరిశ్రమ, అభిమానులు సగర్వంగా చెప్పే మాట షారుక్ ఖాన్ లేకపోతే భారతీయ సినిమాకి సరికొత్త శోభ వచ్చి ఉండేది కాదు అని. ఆ మాట అక్షర సత్యమనే రీతిలో 1995 అక్టోబర్ 20 న వచ్చిన దిల్ వాలే దుల్హనియా లేజాయింగే చిత్రం ఇంకా థియేటర్ లో ఆడుతూనే ఉంది.
అలాంటి కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అప్ కమింగ్ మూవీ 'కింగ్' . పఠాన్', 'జవాన్' వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత షారుక్ నుంచి వస్తుండగా టాలెంటెడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ఈ గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేట్రికల్ విడుదలకు ముందే ఈ చిత్రం నాన్-థియేట్రికల్ బిజినెస్ పరంగా, ముఖ్యంగా సంగీత హక్కుల విషయంలో సృష్టించిన సంచలనం ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజా బాలీవుడ్ కథనాల ప్రకారం, 'కింగ్' సినిమా మ్యూజిక్ రైట్స్ కోసం దాదాపు 50 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లోని అగ్రగామి సంగీత సంస్థలైన సోనీ మ్యూజిక్ ఇండియా, సారేగమ, అలాగే టీ-సిరీస్ వంటి ప్రముఖ లేబుల్స్ ఈ చిత్ర ఆల్బమ్‌ను దక్కించుకోవడానికి తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఈ రేసులో ఒక అగ్ర సంస్థ ఏకంగా . 50 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తూ అగ్రస్థానంలో నిలిచిందని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకే ఒక్క హిందీ సినిమా ఆల్బమ్ కోసం ఈ స్థాయి రేటు పలకడం ఆడియో మార్కెట్‌లో సరికొత్త చరిత్రకి శ్రీకారం చుట్టింది.
ఆధునిక సినీ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న మూడో అతిపెద్ద మ్యూజిక్ డీల్‌గా 'కింగ్' నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో 'రామాయణ్', 'ధురంధర్ 2' చిత్రాలు ఉండగా, ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే 'రామాయణ్' మ్యూజిక్ రైట్స్ . 75 కోట్లు అయినప్పటికీ అది రెండు భాగాలకు కలిపి జరిగింది. కానీ 'కింగ్' చిత్రం ఒక్క భాగంతోనే ఏకంగా 50 కోట్ల మైలురాయిని సమీపించి రికార్డులను తిరగరాస్తోంది. ప్రముఖ సంగీత ద్వయం సచిన్ - జిగర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండటం, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతాన్ని (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) అందిస్తుండటంతో ఈ ఆల్బమ్‌పై ఆడియో వర్గాల్లో ఊహించని క్రేజ్ ఏర్పడింది.
Also read: మేకప్ లేకుండా త్రిప్తి డిమ్రి ఏం చేసిందంటే.. ఓ మై గాడో
షారూఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ తొలిసారిగా బిగ్ స్క్రీన్‌పై స్క్రీన్ షేర్ చేసుకుంటుండటం విశేషం. వీరితో పాటు అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణె వంటి అగ్ర నటీనటులు ఈ యాక్షన్ డ్రామాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఆఖరి దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేవలం 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఆగస్టు నెలలో జరిగే చివరి అంతర్జాతీయ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. 2026 క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి సిద్ధార్థ్ ఆనంద్ అండ్ టీం కృషి చేస్తోంది.
shah rukh khan, Siddharth Anand, KIng
![]() |